ETV Bharat / state

కొత్తవలసలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. ఒడిశా వాసి మృతి - కొత్తవలసలో నిలిచిన రైలు గుండెపోటుతో వ్యక్తి మృతి

train stopped
కొత్తవలసలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత
author img

By

Published : Jun 18, 2022, 12:33 PM IST

Updated : Jun 18, 2022, 4:14 PM IST

12:24 June 18

గుండెజబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖ వస్తున్న జోగేష్‌ బెహరా

కొత్తవలసలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. ఒడిశా వాసి మృతి

Agnipath effect on trains: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ఓ ప్రాణం పోయింది. అత్యవసర చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ గుండె జబ్బు బాధితుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో చోటు చేసుకుంది.

అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎక్స్​ప్రెస్ రైలును రైల్వే అధికారులు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు విశాఖపట్నం చేరుకోడానికి బస్సులు, ఆటోలు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా నహుపాడకు చెందిన గుండెజబ్బు ఉన్న వ్యక్తి జోగేష్ బెహరా(75) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా విశాఖకు తరలించేందుకు స్థానికంగా ప్రైవేటు అంబులెన్సులు అందుబాటులో లేకపోవటంతో బాధితుడి కుటుంబ సభ్యులు కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 18, 2022, 4:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.