విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై విజయనగరం వైపు ప్రయాణిస్తున్న మిడతాన దేవుడు (43) అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో దేవుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేసిన దేవుడు... మండలంలోని అలమండ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై... సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి:
బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు- సహాయక చర్యలు ముమ్మరం
కరోనా వేళ అన్ని రంగాల ప్రజా సహకారం.. గ్రీన్జోన్లో విజయనగరం జిల్లా