కొవిడ్ ఉమెన్ వారియర్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుశాఖ నుంచి నామినేట్ అయిన.. విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారిని జాతీయ మహిళా కమిషన్ నేడు దిల్లీలో ఘనంగా సత్కరించింది. కేంద్ర అటవీ మరియు సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అవార్టు ప్రదానం చేశారు. కొవిడ్ వారియర్‌గా తన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు విజయనగరం జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా విపత్కర సమయంలో విజయనగరం జిల్లా ఎస్పీ నిత్యం క్షేత్రస్థాయిలో ఉండి.. ప్రజలకు అండగా నిలిచారు. కొవిడ్ పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వలస కార్మికులకు రేయింబవళ్లు సేవలందించారు. విపత్కర సమయాల్లో పోలీసు సిబ్బంది అందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచినందుకు నేడు అవార్డు అందుకున్నారు.
ఇదే విధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అంగన్వాడీ టీచర్ చంద్రకళకు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ అవార్డును అందించారు. కొవిడ్ సమయంలో చిన్నారులకు పోషకాహారం అందించడంలో చేసిన కృషికి చంద్రకళకు పురస్కారం లభించింది.
ఇదీ చదవండి: