విజయనగరం పట్టణంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో జాతీయ స్థాయి ఆదివాసీల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి, అరకు ఎంపీ మాధవి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అక్కులప్పల నాయక్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు విద్య చాలా అవసరమని పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక బాక్సైట్ మైనింగ్ రద్దు చేస్తూ జీవో ఇచ్చారని తెలిపారు. గిరిజన సంక్షేమం కోసం ఎస్టీ కమీషన్ తీసుకొచ్చారని.. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలతో పేద విద్యార్థులకు బాసటగా నిలిచారని కొనియాడారు. వేడుకల్లో విద్యార్థుల జానపద నృత్యాలు అలరించాయి.
ఇదీ చూడండి: