ETV Bharat / state

హద్దులు మీరిన వేళ... జరిమానాల జోరు - విజయనగరంలో ట్రాఫిక్​ పోలీసులు తాజా వార్తలు

ఏడాదికి మహా అయితే రూ.2 కోట్లు వరకు వచ్చేది. కరోనా వల్ల ఈ నెల రోజుల వ్యవధిలో ఆ లక్ష్యాన్ని అధిగమించేశారు. రూ.2.40 కోట్లు ఈ-చలానా ద్వారా శాఖకు చేరింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ రహదారులపైకి వస్తున్న వాహనచోదకులపై పోలీసులు విధించిన మొత్తం ఇది!

police penalties in vizainagaram
విజయ.నగరంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
author img

By

Published : Apr 27, 2020, 12:37 PM IST

నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానా వసూలు చేస్తున్నారు పోలీసులు. అయినా కొన్ని చోట్ల చాలా మంది నిబంధనలు ఖాతరు చేయడం లేదు. వారికి తెలియని విషయం ఏమిటంటే గతంలో శిరస్త్రాణానికి ఒకటి, సీటు బెల్టుకు ఒకటి, ఇలా ఒక్కో తప్పునకు ఒక్కో రకంగా జరిమానా ఉండేది. కానీ.. ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన చట్టం కింద ఇప్పుడు అందరూ రూ.530 చెల్లించాల్సిందే. కచ్చితంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు.

అతిక్రమించిన వారిపైనే చర్యలు:

జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. అయినా కొంతమంది అనవసరంగా రోడ్లు మీదకు రావడం వల్ల కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. ఎవర్నీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. ప్రజల కోసమే నిరంతరం రహదారులపైన అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు.

ఇవీ చూడండి...

విజయనగరం..మరింత కట్టుదిట్టం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.