ETV Bharat / state

MLC MADHAV: 'కృష్ణా జలాలపై.. తెలుగు సీఎంల వైఖరి సరికాదు'

కృష్ణా జలాల వివాదంలో ఆంధ్ర-తెలంగాణ సీఎంల తీరుపై భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఆక్షేపించారు. వివాదంలో కేంద్రాన్ని భాగస్వామిని చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పన్నుల పెంపునకు కేంద్రమే కారణమన్నట్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.

MLC MADHAV
కృష్ణా జలాలపై.. తెలుగు సీఎంల వైఖరి సరిగాదు
author img

By

Published : Jul 13, 2021, 6:03 PM IST

కృష్ణా నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాస్పదంగా మాట్లాడడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ అన్నారు. ఆంధ్ర-తెలంగాణ ముఖ్యమంత్రులు అనేకసార్లు కలిసినా.. నీటి వాటాల విషయంలో ఇప్పుడు కొత్త వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు.. ఈ విషయంలో కేంద్రాన్ని భాగస్వామ్యం చేయడాన్ని తప్పుగా భావిస్తున్నామన్నారు. ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి నీటి వనరులు, వాటి వినియోగంపై భాజపా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న మేధావులు, నిపుణులతో జల వివాద పరిష్కారంపై శాస్త్రీయ అధ్యయనం చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా భాజపా కార్యాలయంలోని కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీఎస్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్.. కృష్ణాజలాలపై మాట్లాడారు.

రాజకీయ లబ్ధి కోసమే మాన్సాస్ ట్రస్ట్​ వ్యవహారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అసత్య ప్రచారం చేశారని ఆయన తప్పుబట్టారు. రామతీర్ధం, సింహాచలం, పద్మనాభ స్వామి దేవాలయాల భూములను ఆడిట్ చేసి కాపాడాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం రూరల్, విజయనగరానికి సంబంధించి వీఎమ్మార్డీఏ(VMRDA) మాస్టర్ ప్లాన్​లో లోపాలున్నాయని అన్నారు. విజయనగరం జిల్లాలోని రైతులకు ఈ మాస్టర్ ప్లాన్ సమాచారం తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్లాన్​ను తెలుగులో ముద్రించాలని కోరారు. ఈ ప్లాన్ అమలైతే సుమారు 75 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. ఈ మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వెంటనే ఈ మాస్టర్ ప్లాన్ గడువు పెంచి ప్రజలందరికీ సమాచారం వచ్చే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, పన్నులు పెంచాలని చెప్పలేదని.. మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

బస్సు దిగుతుండగా బైక్ ఢీకొట్టి ఎగిరిపడ్డ కండక్టర్​

Mansas Trust: ప్రభుత్వ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ.. రెండు వారాలకు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.