విజయనగరంలోని రామకృష్ణనగర్లో మరుగుదొడ్ల నిర్మాణానికి, 19 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారికి.. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. కాలనీ వాసులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు పట్టాలను అందించారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో కాలనీ ప్రజలు ఇబ్బంది పడ్డారని.. సమస్యలు తన దృష్టికి రాగానే పరిష్కారానికి చర్యలు తీసుకున్నాననీ చెప్పారు. తాను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నగరంలో గోశాల, జొన్నగుడ్డి, ముచ్చువాని చెరువు, ఉప్పర పేటల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: