ముఖ్యమంత్రి జగన్ గిరిజన పక్షపాతి అని సాలూరు వైకాపా ఎమ్మెల్యే రాజన్న దొర వ్యాఖ్యానించారు. గిరిజన సంక్షేమం కోసం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. మూడు లక్షల ఎకరాల భూమిని సుమారు లక్ష అరవై వేల మందికి పంపిణీ చేసి భూహక్కులు కల్పించారని కొనియాడారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పుతూ... ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. గిరిజనుల సమ్మతి లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి తవ్వకాలు చేపట్టబోమని రాజన్నదొర స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: