విజయనగరం జిల్లాలో మత్స్యకారులకు భరోసా ఇచ్చేలా జెట్టి నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు అన్నారు. పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి, కోనాడ ప్రాంతాలకు అనుకూలంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
శ్రీకాకుళం వెళ్తున్నా ఆయనకు భోగాపురం జాతీయ రహదారి వద్ద ఎంపీ బెల్లం చంద్రశేఖర్ సమక్షంలో వైకాపా మండల అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. జెట్టి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో మాట్లాడి నెల రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి