విజయనగరం జిల్లా పార్వతీపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా రైతులు నష్టపోకూడదనే ఆలోచనతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మొక్కజొన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : హాట్ స్పాట్లపై దృష్టి పెట్టండి: సీఎం జగన్