ETV Bharat / state

Minister Botsa: పాతవే జిల్లా ప్రజాపరిషత్‌లు: మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడుతున్నప్పటికీ.. జడ్పీల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వాటి విభజన ప్రక్రియపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అన్నారు.

Minister Botsa satyanarayana says old zilla parishad's will be continued
పాత జడ్పీల పాలనే: బొత్స సత్యనారాయణ
author img

By

Published : Apr 4, 2022, 7:24 AM IST

Minister Botsa: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడుతున్నప్పటికీ.. జిల్లా ప్రజాపరిషత్‌లు పాతవే కొనసాగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జడ్పీల విభజన ఇప్పట్లో లేనట్లేనని, వాటి విభజన ప్రక్రియపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. అంతవరకు ప్రస్తుతమున్న ప్రాంతాలనుంచే పాలన సాగుతుందని స్పష్టం చేశారు.

యథావిధిగా జడ్పీలు: కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ జిల్లా ప్రజాపరిషత్‌లు యథావిధిగా కొనసాగుతాయని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులిచ్చారు. పరిషత్‌ అధికారాలు, పరిధిలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

DISTRICT HEADQUARTERS : అన్ని ప్రాంతాలకు అందుబాటులో జిల్లా కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.