ETV Bharat / state

Minister Botsa: 'తెేదేపా నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి' - మంత్రి బొత్స వార్తలు

'ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట తెదేపా నేతలు పోరాటాలు చేస్తామంటున్నారు.. ఇలాంటివి చేసేటప్పుడు ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి' అని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు తెేదేపా నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

author img

By

Published : Aug 28, 2021, 9:54 PM IST

'ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట తెదేపానేతలు పోరాటాలు చేస్తామంటున్నారు..ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి' అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని, ఆలోచన చేయాలని సూచించారు.

"అధికారం కోల్పోయిన వారు ఇలాంటివి చేయకూడదు. జగన్‌మోహన్‌రెడ్డి సమగ్ర అభివృద్ధితో 3 రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారు. ఏ ఒక్క భవనం కట్టకుండా అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి, సుజల స్రవంతి, స్టీల్‌ ప్లాంట్‌, గంగవరం పోర్టుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు? ఏ హక్కు ఉందని అడుగుతున్నారు? స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను స్వయంగా ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు ఈ విషయం చెప్పారు. మోదీ ప్రభుత్వంలో అశోక్‌ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. అప్పట్లోనే ఈ ప్రైవేటీకరణ జరిగింది. ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు? అచ్చెన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు.. భక్షకులు" - బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి

రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు. కేంద్రం పెంచిన చమురు ధరలతో ప్రజలే కాకుండా ప్రభుత్వం సైతం బాధ పడుతోందని అన్నారు. ధరలు కేంద్రం పెంచితే.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయటం ఏమిటని బొత్స ప్రశ్నించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో సాంకేతిక ఇబ్బందులు తొలిగిన తర్వాతే.. నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఆంధ్ర - ఒడిశా రాష్ట్ర సరిహద్దు కొఠియా సమస్య.. అంతర రాష్ట్ర సరిహద్దు వివాదమని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. సమస్యపై సామరస్యంగా చర్చలు జరగాల్సి ఉందన్నాని బొత్స వెల్లడించారు. వీఎంఆర్డీ మాస్టార్ ప్లాన్​లో లోపాలు తమ దృష్టికి వచ్చాయన్న మంత్రి.. వాటన్నింటినీ సవరించి మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఇదీ చదవండి:

AP Govt: వివిధ శాఖలపై కోర్టుల్లో కేసులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.