ETV Bharat / state

'నేనూ బీసీ మంత్రినే... అచ్చెన్నాయుడు ఎలాగో నేను అంతే' - అచ్చెన్నాయుడుపై బొత్స కామెంట్స్ న్యూస్

ఇళ్ల స్థలాల పంపిణీ కోసం బలవంతపు భూసేకరణ ఎక్కడా జరగలేదని... మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని మండిపడ్డారు.

అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుంద

author img

By

Published : Feb 22, 2020, 8:45 PM IST

'నేనూ బీసీ మంత్రినే... అచ్చెన్నాయుడు ఎలాగో నేను అంతే'

ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం దగ్గర సరిపోయే భూమి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎక్కడైనా స్థలం సరిపోకుంటే... నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. ఈ నెల 24న విజయనగరంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి బొత్స అధికారులతో సమీక్షించారు.

గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటును ప్రతిపక్షం విమర్శించడం సరికాదని బొత్స పేర్కొన్నారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇన్​సైడర్ ట్రేడింగ్ గురించి చెప్పామన్నారు. విచారణ చేయండి... తప్పు చేస్తే శిక్షించండి అన్న తెదేపా... ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తే గోల చేయడమేంటని ప్రశ్నించారు.

భూసేకరణలో అవకతవకలు జరిగాయని తాము మొదట్లోనే చెప్పామన్నారు. విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని బీసీ మంత్రులను టార్గెట్ చేశారనడం హాస్యాస్పదమని బొత్స పేర్కొన్నారు. తానూ బీసీ మంత్రినేనని... గతంలో పదేళ్లు మంత్రిగా పని చేశానని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: తెదేపానే కాదు.. ఏపీని టార్గెట్ చేశారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.