వైద్య సిబ్బందికి శానిటైజర్స్,మాస్క్‌లను అరకు పార్లమెంట్ ఎంపీ మాధవి దంపతులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ మాధవి అన్నారు. అనంతరం పార్వతీపురం ఐసోలేషన్ వార్డు అనుమానిత కేసుల నమూనా సేకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పురపాలక సంఘం 11వ వార్డులో ఉన్న నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
ఇదీ చూడండి ఆసియాపై కరోనా పట్టు- స్పెయిన్‌లో తగ్గుముఖం