రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. తన కోరికను అమ్మవారు తప్పక నెరవేరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాన్సాస్ మాజీ ఛైర్మన్, దివంగత ఆనంద గజపతిరాజు జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు.
మాన్సాస్ ట్రస్టులో ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ కర్తవ్యాన్ని కూడా రాష్ట్ర సర్కార్ నిర్వర్తించడం లేదని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సింహాచలం దేవస్థానానికి ఇస్తామంటున్న ఐదు వందల ఎకరాల భూమిపై స్పష్టత లేదన్నారు. ధర్మాన్ని రక్షించాలంటే హిందూధర్మం గురించి తెలిసుండాలని పేర్కొన్నారు.
ఇదీచదవండి.