విజయనగరం జిల్లా పైడితల్లి తొలేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుని మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ కమిటీ అమ్మవారికి సారెను అందచేసింది. పైడితల్లి ఉత్సవాల సందర్భంగా గత ఐదేళ్ల నుంచి మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ కమిటీ ఆనవాయితీగా అమ్మవారికి సారెను అందిస్తోంది. ఈ ఏడాది కూడా పట్టువస్త్రాలు, 108రకాల మిఠాయిలు, బంగారం, వెండి, ఫల-పుష్పాలు, పుసుపు-కుంకుమ కమిటీ సభ్యులు అందజేశారు. మన్నార్ రాజగోపాల ఆలయం నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం వరకు మేళాతాళాలతో 200మంది ర్యాలీగా వచ్చి అమ్మవారికి సారెను అందచేశారు.
ఇదీ చదవండి: అత్యాధునిక ఆస్పత్రి.... ప్రారంభమయ్యేనా వచ్చే ఏడాది?