విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సినీ నటి లావణ్య సందడి చేశారు. ఈ సందర్భంగా భాజపా అభ్యర్థి తరఫున పురపాలక సంఘంలోని 12వ వార్డులో ఇంటింటికీ ప్రచారం చేసిన ఆమె.. భాజపా అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని లావణ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం పుర ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు - పురపోరు ఎన్నికల ప్రచారంలో సినీ నటులు
స్థానిక ఎన్నికల ప్రచారంలో కొత్త పదనిసలు కనిపిస్తున్నాయి. సినీ నటులు పురపోరు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది.
పార్వతీపురం పురఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు