విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెట్టంగి గ్రామంలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని రైతులు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మార్వో కల్పవల్లి.. తెట్టంగి గ్రామంలోని జగ్గా బందా, పెద్ద చెరువులను సందర్శించారు. ఒక్కో చెరువులో మూడున్నర ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు.
ఆ 2 చెరువులకు సరిహద్దులు వేసి ఎన్నారీజీఎస్లో ప్రిన్స్ కటింగ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ చెరువులను కాపాడి భూగర్భ జలాలు పెరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఇటువంటివి పునరావృతమైతే... కఠిన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారులను ఎమ్మార్వో హెచ్చరించారు.
ఇదీ చదవండి: