బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన కుసుమ కుమారి ఎమ్మెల్యే కోలగట్లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు.
మహిళలకే ప్రాధాన్యం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల నూతన డైరెక్టర్‌కు శుభాభినందనలు తెలియజేశారు. బీసీ కార్పొరేషన్ పదవుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకే అధిక ప్రాధాన్యత కల్పించారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు.
ప్రతి కార్పొరేషన్లో 13 మంది..
అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రతి కార్పొరేషన్లో 13 మంది డైరెక్టర్లను నియామించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్ పాదయాత్ర ద్వారా వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు.
16 నెలల కాలంలోనే..
బీసీల సంక్షేమం కోసం 16 నెలల కాలంలోనే రూ. 33 వేల 500 కోట్ల రూపాయలను బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసిందని ప్రశంసించారు. కార్యక్రమంలో కళింగ వైశ్య అసోసియేషన్ ప్రతినిధులు దేవరశెట్టి శ్రీరామమూర్తి, గుడ్ల వెంకటరావు, తంగుడు శ్రీనివాసరావు, కోట్ని రామకృష్ణ, వారణాసి రామకృష్ణ, అంధవరపు రమణ మూర్తి, డోకి సతీష్, డి వాసు తదితరులు పాల్గొన్నారు.