కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి తమను ఆదుకోవాలని.. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిధిలోని ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణికి వినతిపత్రం అందించారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ లాక్ డౌన్ వలన అవన్నీ వాయిదాపడి తమ జీవనోపాధి దెబ్బతిందని ఫొటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలు పూర్తిగా పడిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పుష్పశ్రీవాణి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి.. కిలో కంది పప్పు రూ.110.. కిలో చింతపండు రూ.240