విజయనగరం జిల్లా పార్వతీపురంలో.. రూ.46 లక్షల విలువగల నిషేధిత ఖైనీ, గుట్కా ప్యాకెట్లను.. పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో.. షేక్ ముస్తాఫా అనే వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.32 లక్షలు విలువ చేసే ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కొత్తవలస ప్రాంతానికి చెందిన మరో వ్యాపారి.. గోదాము నుంచి రూ.14 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లను తీసుకువస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ఖైనీ, గుట్కా దిగుమతి చేసుకుని.. జిల్లాలో వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. వ్యాపారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళాధర్ తెలిపారు.
ఇదీ చదవండి: