లాక్డౌన్ వేళ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడంపై విజయనగరంలో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలు నిలిపేయాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని జనసేన నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాలకు, అభివృద్ధికి వ్యతిరేకంగా.. సంక్షేమానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇదే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు టి.రామకృష్ణ, రాజేష్, పి.కుమారస్వామి, పీవీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి..