ETV Bharat / state

యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​ - జగనన్న కాలనీ

Janasena Leader Pawan Kalyan: రాజధాని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి వేలకోట్లు అవినీతి సొమ్ము దోచుకుంటున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గుంకలాం కాలనీనీ సందర్శించిన పవన్, జగనన్న ఇళ్ల నిర్మాణంలో రూ.10 నుంచి 15 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై ప్రధానికి తానే స్వయంగా నివేదిక అందజేస్తానన్నారు.

Pawan Kalyan
Pawan Kalyan
author img

By

Published : Nov 13, 2022, 3:40 PM IST

Updated : Nov 13, 2022, 7:33 PM IST

Pawan Kalyan in Vizianagaram District: పేదలందరికీ 28 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపించారు. జగనన్న ఇళ్లు- పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆయన రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జగనన్న లేఔట్ అయిన విజయనగరం జిల్లా గుంకలాం కాలనీని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేదల ఇళ్ల పేరిట వేల కోట్లు దోచుకున్నారని, భూ సేకరణలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానికి నేరుగా నివేదిక అందజేస్తానన్నారు.

రాజధాని సెంటిమెంట్ రగిల్చి ఉత్తరాంధ్ర ప్రజలను జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని, దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ గమనించాలని పవన్ పిలుపునిచ్చారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించలేని ప్రభుత్వం.. రాజధాని ఎక్కడి నుంచి నిర్మిస్తుందని ఆయన ప్రశ్నించారు. విశాఖలో వందల ఎకరాల భూములను.. అధికార పార్టీ నేతలు బలవంతంగా లాక్కున్నారన్నారని పవన్ విమర్శించారు. అవినీతిపై రాజీ లేని పోరాటం చేద్దామని.. యువత వెనకు తానుంటానని జనసేనాని అభయమిచ్చారు. అంతకు ముందు విశాఖ నుంచి గుంకలాం బయలుదేరిన పవన్‌కు.. అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. హారతులు పట్టి ఆహ్వానించారు. గజమాలతో సత్కరించి, పూల వర్షం కురిపించారు. జనసేనాని రాకతో విజయనగరం-ఒడిశా ప్రధాన రహదారి జనసంద్రమైంది. సుమారు 7 కిలోమీటర్లు రహదారి మొత్తం జనప్రవాహంతో నిండిపోయింది. పెద్దఎత్తున యువత పవన్ వెంట నడిచారు.

జగనన్న కాలనీలపై సోషల్‌ ఆడిట్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్

'రాజధాని పేరిట ఉత్తరాంధ్రను వైకాపా మోసం చేస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపా నాయకులు చేసే మోసాన్ని గ్రహించాలి.ఉత్తరాంధ్రకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షిస్తున్నాను. జగనన్న కాలనీల పేరుతో వైకాపా నేతలు చేసిన కుంభకోణంపై తానే స్వయంగా ప్రధాని మోదీకి నివేదిక అందజేస్తాను. పేదలకు ఇళ్లు పేరుతో వైకాపా నేతలు ఇష్టారీతినా దోపిడీకి పాల్పడుతున్నారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్రను ముఖ్యంగా యువతను మోసం చేస్తున్నారు. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలి. తనపై నమ్మకముంచితే గూండాలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. వెల్లడించారు. దిల్లీకి వెళ్లి చిన్నపిల్లల్లాగా నాపై చాడీలు చెప్తున్నారు. ఇకపై ఉత్తరాంధ్ర నాయకులు సంగతి ఇక్కడి ప్రజలు చూసుకుంటారు. తమకు ఓట్లు వస్తాయో లేదో తెలియదు.. అయినా నాయకులను నిలబెడతాం.'- జనసేన అధినేత పవన్‌కల్యాణ్

ఇవీ చదవండి:

Last Updated : Nov 13, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.