ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ విజయనగరం జిల్లా సాలూరు మండలం కుర్మరాజు పేట సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. సంక్షేమ పథకాల కోసం అందే వినతుల పరిష్కారం నిమిత్తం చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాలకు మంచి పేరు తీసుకురావడమనేది సిబ్బంది చేతుల్లోనే ఉందని, ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిత్యం కృషిచేయాలని సూచించారు.
అనంతరం కుర్మరాజు పేట ఎం.పీ.యూ.పీ స్కూల్లో చేపడుతున్న నాడు నేడు పనులు పరిశీలించి సంబంధిత ఆధికారులతో మాట్లాడారు. నిర్మాణ పనుల్లో పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించటంతోపాటుగా.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...