గ్రామ సచివాలయాల సిబ్బంది పని చేసే గ్రామంలోనే నివాసం ఉన్నప్పుడే ప్రజలకు సత్వర సేవలు అందించగలరని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి(పీవో) ఆర్.కూర్మనాథ్ అన్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మొసూరు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయట నుంచి విధులకు వస్తున్న సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని వేళల్లో అందుబాటులో లేకపోవటంతో మొసూరు పంచాయతీ సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఎంపీడీవోకి మెమో పంపాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్ సూచించారు. అనంతరం మొసూరు ఎంపీపీ పాఠశాల, పాంచాలి జడ్పీహెచ్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు- నేడు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. పర్యటనలో భాగంగా గురువునాయుడు పేట పీహెచ్సీని సందర్శించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు.
ఇదీ చదవండి