అక్రమైనింగ్‌తో తీవ్రంగా నష్టపోతున్నామని విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అనధికారికంగా జరుపుతున్న మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని విశాఖలో డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖ అనుమతుల్లేకుండా గనులు తవ్వేస్తున్నారని వాపోయారు. ఈ చర్యలతో గ్రామాల్లో కాలుష్యం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా తమపై దాడులు చేస్తోందని వీలుపర్తి గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామం చుట్టుపక్కల సుమారు 300 ఎకరాలు భూమి కాలుష్యమయంగా మారిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి