ETV Bharat / state

570 టన్నుల ఇసుక అక్రమ నిల్వలు స్వాధీనం

స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు జరిపిన దాడుల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక నిల్వలను గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 570 టన్నుల ఇసుకను ఎస్​ఈబీ అధికారులు స్వాధినం చేసుకున్నారు.

special enforcement bureau
అక్రమ ఇసుక నిల్వలు స్వాధీనం చేసుకున్న ఎస్​ఈబీ అధికారులు
author img

By

Published : Nov 20, 2020, 9:12 AM IST

గృహ నిర్మాణాలకు ఇసుక లభ్యం కాకపోవటం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న ఇసుకపై ప్రయోగాలు విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎస్ఈబి దాడుల్లో.. 570 టన్నుల అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో.. మండలంలోని మర్యాడ పంచాయతీలో 240 టన్నులు, పూసపాటిరేగ మండలం కంది మల్ల పంచాయతీలో 330 టన్నుల ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఐ డీ.డీ నాయుడు తెలిపారు.

ఇవీ చూడండి...

గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.