ETV Bharat / state

Murder: పసిబిడ్డలను నేలకేసి కొట్టిన తండ్రి.. భార్యతో గొడవపడి ఘాతుకం!

ఇంట్లో గొడవలకు అభం శుభం తెలియని పిల్లలు బలవుతున్నారు. తల్లిదండ్రులు ఉద్రేకంతో.. చిన్నారులను పాశవికంగా హత్య (murder) చేస్తున్నారు. కనీసం జాలైనా లేకుండా.. వాళ్ల ప్రాణాన్ని తీసేస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి.. తన ఇద్దరు చిన్నారులను నేలకొసి కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల పాప మృతిచెందగా... ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి.

Husband who quarrel with wife and killed  his  daughter  at jodimamamidivalasa
భార్యతో గొడవపడి ఇద్దరు పాపలను నేలకేసి కొట్టిన భర్త
author img

By

Published : Jul 10, 2021, 10:07 AM IST

Updated : Jul 10, 2021, 10:13 AM IST

భార్యాభర్తల గొడవల్లో పిల్లల.. ప్రాణాలు పోతున్నాయి. ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా.. బాధ వచ్చినా.. కొందరు తమ పిల్లలనే నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తున్నారు. ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలైనా సరే.. వాటికి పరిష్కారం వెతకుండా వాళ్లు బలవన్మరణానికి పాల్పడుతూ.. అభం శుభం ఎరుగని చిన్నారులను సైతం హత్య చేస్తున్నారు.

ఇలాంటి ఓ గొడవ.. ఇద్దరు పసిబిడ్డల పాలిట మృత్యుపాశమైంది. భార్యతో గొడవపడిన ఆ భర్త.. తన పిల్లలపాలిట మృత్యువులా మారాడు. కోపంతో ఇద్దరు పసి బిడ్డలను బండకేసి కొట్టాడు. ఈ దారుణమైన ఘటనలో.. రెండేళ్ల పసి పాప అక్కడికక్కడే మరణించగా.. ఐదేళ్ల వయసున్న మరో పాప.. తీవ్ర గాయాలపాలైంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడి వలసలో ఈ ఘాతుకం జరిగింది.

స్థానికులు ఈ విషయాన్ని గమనించి.. ఆ క్రూర తండ్రి కిరాతకంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని ప్రసాద్ గా గుర్తించిన పోలీసులు.. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

నేనేం పాపం చేశానమ్మా!..ఏ చెత్తకుప్పలో పడేసినా బతికి ఉండేదాన్ని!

Last Updated : Jul 10, 2021, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.