వందేళ్ల నాటి పాత రెగ్యులేటర్ను అధికార యంత్రాంగం తొలగిస్తున్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిపై 1907లో నిర్మించిన పాత రెగ్యులేటర్ను పూర్తిగా తొలగించేందుకు ఇంజినీరింగ్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ రెగ్యూలేటర్ సుమారు వందేళ్ల పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది. వర్షాకాలంలో వస్తున్న వరదనీటి ఉద్ధృతికి కోతకు గురై తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో నాలుగేళ్ల కిందట వంతెన రహదారి మీదుగా కురుపాం, పార్వతీపురం మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అప్పట్లో కొంత తొలగించి వదిలేయగా.. తాజాగా ఉన్నతాధికారలు ఆదేశాల మేరకు మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి :