ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల్లోని గృహాల్లో దొంగతనాలకు పాల్పడుతోన్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను విజయనగరం జిల్లా పోలీసులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10.50 లక్షలు విలువైన 200 గ్రాముల బంగారు, 3 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. జిల్లాలోని కురుపాం, పార్వతీపురంలో ఒకే తరహాలో జరిగిన దోపిడీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దర్యాప్తులో భాగంగా మొదట లోకేష్ అనే వ్యక్తిని విచారించగా... ముఠాకు సంబంధించి మిగిలిన సభ్యుల ఆచూకీ లభించిందన్నారు. ముఠాలో అధిక శాతం ఒడిశాకు చెందిన సభ్యులుండగా.. మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: