విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ లోని తోటపల్లి బ్యారేజీ కుడి కాలువకు గండి పడింది. గరుగుబిల్లి మండలం పెదగుడబ సమీపంలో కాలవ గట్టు తెగిన కారణంగా.. భారీగా నీరు వృథా అయ్యింది. గత నెలలో ఈ కాలువకు సాగునీరు విడిచిపెట్టారు. రైతులు ఆకు మడులు సిద్ధం చేశారు.
మరి కొద్ది రోజుల్లో సాగులో తర్వాత దశకు సన్నద్ధం అవుతున్న తరుణంలో గండి ఆందోళన కలిగిస్తోందని రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న బ్యారేజ్ ఇంజినీరింగ్ అధికారులు.. కాలువలోకి వెళ్లే నీటిని నిలుపుదల చేశారు. అయినప్పటికీ కొంతమేరకు ఆకు మడులు నీట మునిగాయి. అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
ఇదీ చూడండి: