రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ ఒక రోజు పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ దీపికా ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన అతిథి గృహానికి చేరుకొని న్యాయ అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడారు. అక్కడి నుంచి జ్యుడీషియల్ అధికారుల సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కోర్టుకు వెళ్లారు.
న్యాయమూర్తికి స్వాగతం పలికిన వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపి, కలెక్టర్ సూర్యకుమారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శిరీషా, జాయింట్ కలెక్టర్లు జీ.సీ. కిశోర్ కుమార్, జె. వెంకటరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: PROTEST: ప్రైవేటు పాఠశాలలను కాపాడాలంటూ నిరసన