విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. పార్వతీపురం పట్టణంలోని మేదర వీధి సమీపంలో ప్రధాన రహదారిపై నడుము లోతు వరకు నీరు చేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్, అగ్నిమాపక కేంద్రం, పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా రహదారులపై నీరు చేరింది. ఆర్టీవో కార్యాలయం ఎదురుగా చెట్టు కూలడంతో అక్కడినుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. గంటకుపైగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. విశాఖ నగరంలో హఠాత్తుగా మబ్బులు కమ్ముకు వచ్చి ఈదురు గాలులతో భారీ వర్షం ఒక్కసారిగా కురిసింది. రహదారులు అన్ని తడిసి ముద్దయ్యాయి. భారీ గాలులకు పలు ప్రాంతాలలో విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శ్రీకాకుళంలో చల్లబడిన వాతావరణం..
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఉదయం ఏడు గంటల నుంచే భానుడి ప్రతాపంతో ఎండ వేడిమితో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఈ రోజు కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులుతో కురిసిన వర్షాలకు ఒక్క సారిగా ఆకాశం మేఘావృతం కావడంతో పరవశంతో పులకించి పోయారు. కొన్ని చోట్ల ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి.
ఇదీ చదవండి: