విజయనగరం జిల్లాలో పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్- 2 కార్యక్రమానికి రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా యునిసెఫ్ ఆధ్వర్యంలో రీజనల్ వర్చువల్ వర్కుషాపు గురువారం జరిగింది. దీనిలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో రెండేళ్లుగా మన విజయనగరం పేరుతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని కలెక్టర్ జవహర్‌లాల్ చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఇంతకుముందు విజయనగరం జిల్లా జాతీయ అవార్డును గెలుచుకుందన్నారు. సుమారు 50 రోజులపాటు జిల్లాలో కరోనా ప్రవేశించకుండా, గ్రీన్ జోన్‌లో ఉన్నామంటే పరిశుభ్రతే కారణమని తెలిపారు. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా, ప్రజల్ని చైతన్యం చేసేందుకు ప్రత్యేకంగా థీమ్ సాంగ్‌ను రూపొందించి, తానే పాడినట్లు వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.