నిరాశ్రయుల వసతి గృహానికి నిలిచిన ప్రభుత్వ నిధులు food problems: విజయనగరంలోని ఈ వసతిగృహంలో నిరాశ్రయులైన వృద్ధులు, అనాథలకు గత ప్రభుత్వం 2015లో ఆశ్రయం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తూ రాగా.. నిర్వహణ బాధ్యతలను రెడ్‌క్రాస్ సంస్థ చూస్తోంది. కానీ.. గతేడాది నుంచి ప్రభుత్వం నుంచి నిధులు నిలిచిపోవడంతో.. నిరాశ్రయులకు భోజనం సమకూర్చడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. పూటపూటకూ దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా కరుణిస్తేనే.. ఆ పూట భోజనం చేస్తూ.. వసతిగృహంలోని నిరాశ్రయులు దీనస్థితిలో గడుపుతున్నారు.
వసతిగృహం ఏర్పాటు చేసినప్పటి నుంచీ.. వార్డెన్, వంట మనిషి, కాపలాదారు, ముగ్గురు కౌన్సిలర్లు.. బాధితుల ఆలనాపాలనా చూసేవారు. ఏడాది కాలంగా నిధులు నిలిచిపోవడంతో.. వారందరినీ తొలగించి.. వార్డెన్‌ను మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నవారిలో చాలా మందికి అర్హతలు ఉన్నా.. పింఛన్ అందడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది తమను గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి చేకూర్చాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
CM Jagan slams Opposition Parties: 'ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే'