ETV Bharat / state

ఆ ఉపాధ్యాయురాలి తీరే వేరు.. విద్యార్థులకు నచ్చినట్లుగానే బోధన - vizianagaram district education

కరోనా లాక్‌డౌన్‌తో పిల్లలు సెల్‌ఫోన్లలో వీడియో గేమ్​లకు అలవాటు పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలు చిన్నారుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థుల దృష్టి పాఠ్యాంశాల వైపు మళ్లించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వినూత్నంగా ఆలోచించారు. వీడియో గేమ్స్‌ ద్వారానే పిల్లలు పాఠాలు నేర్చుకునే విధంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ డిజైన్ చేశారు. యూట్యూబ్‌, వాట్సాప్‌ద్వారా ఉచితంగా అందరికీ అందజేస్తున్నారు.

వీడియో గేమ్స్‌ ద్వారా బోధన
వీడియో గేమ్స్‌ ద్వారా బోధన
author img

By

Published : Sep 24, 2021, 6:58 PM IST

ఈమె విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. కరోనా నేపథ్యంలో పిల్లలు పుస్తకాలకు దూరం కావటం ఇదే సమయంలో వీడియో గెమ్స్ పట్ల ఆకర్షితులవ్వటం ఈ ప్రధానోపాధ్యాయురాలిని ఆలోచింపచేసింది. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే ఆన్​లైన్ గేమ్స్‌తోనే వాళ్లలో నైపుణ్యాలు, సృజన పెంచాలని ప్రయత్నించారు. ఇంటర్ చదువుతున్న తమ కుమారుడి సహాయంతో పిల్లలకు ఇష్టమైన, అనుకూలమైన అంశాలను తీసుకుని ఆటల రూపంలో పాఠాలు రూపొందించారు. వీటికి ఫ్రీ స్మార్ట్ క్లాస్ పేరుతో వైబ్ సైట్‌నూ రూపొందించి ఉచితంగా ఇంటర్నెట్​లో అందుబాటులో ఉంచారు.

వాయిస్ కమాండ్​తో...

పిల్లల్లో విద్యానైపుణ్యాలు పెంపొందించడం, విద్య వైపు వారి దృష్టిని ఆకర్షించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా తొలుత 18 రకాల ఆన్​లైన్​ ఆటలను తయారు చేశారు. వీటికి విశేష స్పందన లభించటంతో ట్రయల్, ఎర్రర్ మెథడ్స్, గ్రాఫిక్, పిక్చర్ రీడింగ్‌ వంటి విధానాలతో పలు అంశాలతో కూడిన వీడియోలను తయారు చేశారు. ఆటలో ఆసక్తి ఉండేలా ఒప్పు చేస్తే ప్రశంసలు పొందే విధంగా వాయిస్ కమాండ్‌ను జతచేశారు. తప్పు చేస్తే ఆప్యాయంగా కూడిన ఆదేశాలు అమర్చారు. తద్వారా పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేలా తీర్చిదిద్దారు. ప్రతి విద్యార్థి వారి సొంత స్కోరును పొందవచ్చు. సరిగ్గా చేయడం ద్వారా గరిష్ఠ స్కోరును పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇది భాషపై పట్టు పెరగడానికి పరోక్షంగా దోహదపడుతుందని ఉపాధ్యాయురాలు తెలిపారు.

ప్రశంసల వెల్లువ...

పదో తరగతి విద్యార్థులకు క్విజ్ అంశాలతో కూడిన వీడియో గేమ్స్ పాఠాలను ఉషారాణి రూపొందించారు. ఆటల ద్వారా సునాయాసంగా తెలుసుకునే విధంగా జంతు, వృక్షశాస్త్రంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో మెలకువలతో కూడిన వీడియో పాఠాలు తీర్చిదిద్దారు. వీటన్నింటినీ వాట్సాప్ ద్వారా బాస్కెట్ అనే పేరుతో అందుబాటులో ఉంచారు. ఆటల్లోనే బోధన, ఇతర అంశాలు ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని ఈ ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు కృషిని తోటి వారు అభినందిస్తుండగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఉషారాణి చిన్నారుల కోసం చేసిన కృషికి ఎన్​సీఈఆర్​టీ, ఎస్​సీఈఆర్​టీ నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

వీడియో గేమ్స్‌ ద్వారా బోధన

ఇదీచదవండి.

Mundlamuru MPP: డిక్లరేషన్లు ఇచ్చాకే ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక జరపండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.