విజయనగరం జిల్లావ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో గోపూజ ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో గోవులకు పూజలు నిర్వహించారు. విజయనగరం... తితిదే కల్యాణ మండపంలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో గోవుకు వస్త్ర, పుష్పాలంకరణ చేశారు. అర్చనతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలోనూ గోవులను పూజించారు.
ఇదీ చూడండి: