విజయనగరం జిల్లా భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామంలో రహదారికి ఆనుకుని ఉన్న కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అదే గ్రామానికి చెందిన పైడ్రాజు కొన్నేళ్లుగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అనుకోకుండా దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిందా? లేదా ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా.. అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువత స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి