విజయనగరం జిల్లా బొబ్బిలి పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాత్రి విధులకు హాజరైన కానిస్టేబుల్ సుమతి.. స్టేషన్ భవనంపై గడ్డిమందు తాగి, చేతి మణికట్టు కోసుకుంది. మెట్లపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన సిబ్బంది.. ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: Fake challans: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం.. రూ.36 లక్షలకుపైగా అవినీతి