ETV Bharat / state

పంటచేతికొచ్చినా కొనే నాథుడే లేడు...

కరోనా లాక్​డౌన్​ రైతన్నను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చినా.. అమ్ముకునేందుకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి ఇది. కష్టానికి తగిన ఫలితం వచ్చినా...లాక్​డౌన్​ కారణంగా, పంటను మాత్రం మార్కెట్​లో కొనేవారు లేక, పండించిన పంటకు కనీస పెట్టుబడి కూడా రాక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

farmers problems at lockdown time
పంటచేతికొచ్చినా కొనే నాథుడు లేడు
author img

By

Published : Jun 2, 2020, 12:02 PM IST

దేవుడు వరం ఇచ్చినా... పూజారి వరం ఇవ్వడు అన్నట్టుంది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటని అమ్ముకునేందుకు కష్టాలు తప్పడం లేదు. మార్కెట్​కి వెళితే కొనేవారు లేక... పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి, మెరకముడిదం మండలాల రైతులు ఈ సమయంలో వేలాది ఎకరాల్లో నేల చిక్కుడును సాగు చేస్తారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో పంటల దిగుబడి బాగుంది. కానీ...ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది.

సుమారు రెండు నెలలుగా లాక్​డౌన్​ విధించడంతో, రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన ధర లేకపోవడంతో... చాలా వరకు చిక్కుడు పంటలను అమ్ముకునే స్థితి లేక పశువులకు వేస్తున్నారు. మెరకముడిదం మండలం యాడికి గ్రామంలో సుమారు 30 ఎకరాల వరకు చిక్కుడు సాగులో ఉంది. రైతుల శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది. కానీ మార్కెట్లో అమ్ముకునేందుకు పరిస్థితులు లేకపోవడంతో బాధపడుతున్నారు.

గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో ... సుమారు 20 నుంచి 30 ఎకరాల వరకు చిక్కుడు సాగులో ఉంది. ఇక్కడ రైతుల పరిస్థితి కూడా అంతే. కిలో 3 రూపాయల నుంచి 5 రూపాయల మధ్య ధర పలకడంతో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. రైతులు పండించే పంటలకు మార్కెట్​లో సరైన ధర పలకట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి... తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి

సచివాలయంలో కరోనా కలకలం... హోంక్వారంటైన్​కు వ్యవసాయ శాఖ ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.