ETV Bharat / state

పంట కొనుగోలు చేయాలని రైతుల వినతి - corn crop latet news update

అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుంది విజయనగరం జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి. పంట దిగుబడి వచ్చిది. గిట్టుబాటు ధర పరవాలేదనిపించింది. అయినప్పటికీ ప్రభుత్వం తమ వద్ద నుంచి పంట కొనుగోలు చేయకపోవడం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers demands to buy crops
పంట కొనుగోలు చెయ్యండంటూ రైతుల ఆవేదన
author img

By

Published : May 31, 2020, 2:27 PM IST

విజయనగరం జిల్లాలో వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, మెరకముడిదాం, మండలాల్లో వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అయితే లాక్​డౌన్ సందర్భంగా పంటకు ప్రభుత్వమే మద్దతు ప్రకటించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ద్వారా 33 వేల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశారు.

మెరకముడిదాం మండలం గరుగుబిల్లి, శాతం వలస, ఏడిక గ్రామాల్లో సుమారు వందలాది మంది రైతుల దగ్గర మొక్కజొన్న పంట అలాగే ఉండి పోయింది. ప్రభుత్వం స్పందించి తమ దగ్గర పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పెట్టుబడులు పెట్టి, కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 రోజులుగా తమ వద్దే పంట ఉండిపోవడం, నాణ్యత కోల్పోయి, పురుగు పడుతోందని, దీని ద్వారా మార్కెట్ విలువ కోల్పోతున్నామన్నారు.

కొంత మంది రైతులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడం వల్ల 20 వేల టన్నులకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, ప్రభుత్వం నుంచి ఆర్డర్ రాగానే మిగతా రైతుల దగ్గర ఉన్న పంటను కొనుగోలు చేస్తామని అగ్రికల్చర్ ఏడీ వేణుగోపాలరావు తెలిపారు.

ఇవీ చూడండి...

మెంటాడలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.