ETV Bharat / state

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: పాలనాధికారి - AP Municipal elections

త్వరలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ పరిశీలించారు. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారి సూచించారు. లెక్కింపు సమయంలో ఏది వ్యాలిడ్, ఏది ఇన్​వ్యాలిడ్ అనే విషయాన్ని ఏజెంట్లకు ముందుగానే చెప్పాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: పాలనాధికారి

author img

By

Published : Feb 24, 2021, 5:24 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో త్వరలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ పరిశీలించారు. పోలింగ్ ముందు రోజు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు ప్రాంతాలను చూశారు.

పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారి సూచించారు. ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా నిర్వహించాలని... అందుకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఇతర ఏర్పాట్లుపై ఆయన సూచనలు చేశారు.

లెక్కింపు సమయంలో ఏది వ్యాలిడ్, ఏది ఇన్​వ్యాలిడ్ అనే విషయాన్ని ఏజెంట్లకు ముందుగానే చెప్పాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రీకౌంటింగ్ ఆలోచన లేనివిధంగా పక్కాగా లెక్కింపు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. లెక్కింపు అనంతరం సామగ్రిని భద్రపరచాలని... అందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయాలను ఆయన వివరించారు.

ఇదీ చదవండీ... దారుణం: నరసరావుపేటలో నడిరోడ్డుపై డిగ్రీ విద్యార్థిని హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.