విజయనగరం జిల్లా నిమ్స్ ఆసుపత్రి నుంచి 11 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అంతా మనో ధైర్యంగా మెలగాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘురాం సూచించారు. మరో 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. ఇంట్లో చిన్నారులు, వృద్ధులకు దూరంగా ఉండాలన్నారు.
మాస్కును తప్పనిసరిగా ధరించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘురాం సూచించారు. అనంతరం బాధితులకు రూ.2 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. 11 మంది కరోనా బాధితులను 108 వాహనం ద్వారా ఇళ్లకు తరలించారు.
ఇదీ చదవండి: వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు