విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో.. మూడేళ్లుగా ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదంటూ.. జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామానికి వచ్చిన అటవీశాఖ అధికారులను.. తెలుగుదేశం నాయకులతో కలిసి అడ్డుకున్నారు.
పట్టించుకోని అధికారులు..
మూడేళ్లుగా గజరాజులు.. అరటి, చెరకు, వరి పంటలు నాశనం చేస్తున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏనుగుల గుంపు.. అంగన్ వాడీ కేంద్రంలోకి చొరబడి.. సామగ్రిని ధ్వంసం చేసినట్లు వాపోయారు. అంగన్ వాడీకి రావటానికి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించాలని కోరారు.
ఇదీ చదవండి: