విజయనగరం జిల్లా సాలూరులో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాలమీదకు తెచ్చింది. బంగారమ్మ కాలనీకి చెందిన బండిమోహన్(14) స్నేహితులతో కలిసి సరదాగా రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అక్కడ ఓ గూట్స్ రైలు నిలిపి ఉండటంతో తోటి స్నేహితులు వారిస్తున్న వినకుండా రైలు ఎక్కి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.
అక్కడున్న విద్యుత్ తీగలు తగిలి కింద పడిపోయాడు. ఈ లోపే ఆ యువకుడి ఒళ్లంతా కాలిపోయింది. వెంటనే తోటి స్నేహితులు సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం విజయనగరం సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు.