తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ షేక్ బాషా కొత్తపేటలో రెడ్‌జోన్‌గా ప్రకటించిన మార్కెట్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెడ్‌జోన్‌లో నిర్వహిస్తున్న బందోబస్తు, అక్కడి పరిస్థితులను ఎస్సై రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలంతా ఇళ్ల వద్దే ఉంటూ కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని డీఎస్పీ తెలిపారు. రెడ్‌జోన్‌లో ఉన్న ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువులు అందించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇతర ప్రదేశాల్లో దాతలు ఎవరైనా సాయం చేయాలనుకునే వారు ఎస్సైని సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి: పాత్రికేయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ