విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చిన్నారులకు ధనుర్వాతం, కోరింత దగ్గు, కంఠసర్పి రాకుండా ఉండేందుకు డీపీటీ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యాధికారి సునిల్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రభావం నుంచి చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.
చిన్న సమస్య వచ్చినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని కోరారు. మాస్క్ ధరించాలని... తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఎక్కడ ఉన్నా భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: