ETV Bharat / state

'కష్టాల్లో ఉన్న అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి'

ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఇంటిపని చేసే కార్మికులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

domestic workers protest for employment at vizayanagarm
ఆపదలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలి
author img

By

Published : Sep 24, 2020, 6:00 PM IST

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని... ఈ విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాయం చేయాలని డిమాండ్​ చేస్తూ... విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేశారు.

ఇంటిపని చేసేవారు అత్యవసర కార్మికులే కాని వ్యాధివ్యాప్తి చేసేవాళ్లు కాదని... తమ పట్ల వివక్షత చూపొద్దని వారు కోరారు. ఇంటిపని చేసే వారి కోసం సమగ్ర చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు నివారణ చట్టంలో నిర్ధేశించినట్లుగా అణగారిన వర్గాలకు ఇళ్లలో పని చేసే కార్మికులకు నగదు బదిలీ చేయాలని కోరారు.

ఇదీ చూడండి: చర్చిలో విగ్రహాలు ధ్వంసం.. పోలీసుల దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.