విజయనగరం జిల్లా భోగాపురంలో జరుగుతున్న కనక దుర్గమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరను పురస్కరించుకొని జిల్లా స్థాయి సంగీ రాళ్ళ పోటీలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. ఇసురు పోటు, సీత విభాగాల్లో 80 కేజీల నుంచి 140 కిలోల బరువులు ఎత్తి బలాబలాలను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి...