ETV Bharat / state

బాలాజీ జంక్షన్ వద్ద కాంగ్రెస్​ పార్టీ శాంతియుత సత్యాగ్రహం - విజయనగరం తాజా వార్తలు

హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ చేస్తున్న నిరసనకు విజయనగరంలో ఆ పార్టీ నాయకులు శాంతియుతంగా సత్యాగ్రహం కార్యక్రమం చేశారు. బాధితురాలికి యూపీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ​

district congress party satyagraha
శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న కాంగ్రెస్​ పార్టీ నాయకులు
author img

By

Published : Oct 5, 2020, 6:00 PM IST

హాథ్రస్​ అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయనగరం బాలాజీ జంక్షన్ అంబేడ్కర్​ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుతంగా సత్యాగ్రహం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు పాల్గొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ అధికార యంత్రాంగం నేరస్థులను రక్షించే ప్రక్రియలో ఉందని... వారిని పట్టుకోకుండా ఎర్రతివాచి పరుస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హాథ్రస్​ అత్యాచార ఘటన బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఈ విషయంపై యూపీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

'హాథ్రస్ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.